తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్లో సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న హిందీ పండిట్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ‘ఒక్కరైతే ఒంటరే.. ఒక్కటైతే ఉప్పెన’ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ అదిలాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు రవీందర్ జాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ జాదవ్, గజేందర్, షేర్ సింగ్, డా. ఇందర్ సింగ్, గోకుల్ , వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.