Kejriwal’s sensational comments will resign from the post of CM in two days: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. దిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు. కాగా.. మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.