Former minister Balineni met with Deputy CM Pawan: ఏపీలో రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు టీడీపీలోకి వెళ్లారు. తాజాగా, మళ్లీ జంపింగ్ జపాంగ్‌లు మొదలయ్యాయి. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. నిన్న వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం బాలినేని.. నాగబాబుతో చర్చలు జరిపినట్లు సమాచారం. కొద్దిసేపటి క్రితం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్న బాలినేని పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ఆయన జనసేన గూటికి చేరే అవకాశముంది.