Trending Now

Ponguleti Srinivas Reddy: కేటీఆర్‌కు పొంగులేటి కౌంటర్.. నిరూపించకపోతే రాజీనామా చేస్తారా?

Minister Ponguleti Denied Ktr Amrit Scheme Allegations: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేిసిన ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందించారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌ చెప్పినట్లు అమృత్‌ స్కీమ్‌ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు.

అమృత్ పథకం కింద టెండర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 3,616 కోట్లకు 3 ప్యాకేజీలుగా పిలిచిందని ఆయన తెలిపారు. పోలింగ్‌ తేదీకి ఒక్కరోజు ముందు టెండర్లను కట్టబెట్టారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఒకవేళ ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు. రూ. 3,616 కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Spread the love

Related News

Latest News