Trending Now

Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

Vangaveeti Radha Krishna is unwell: టీడీపీ నేత వంగవీటి రాధా అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున ఛాతిలో నొప్పిగా ఉండటంతో ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో 48 గంటల పర్యవేక్షణలో ఉండాలని రాధా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. వంగవీటి రాధా గుండెపోటు వచ్చిన విషయం తెలియగానే ఆయన అభిమానులు ఆస్పత్రికి చేరుకున్నారు.

Spread the love

Related News

Latest News