Justice DY Chandrachud: సీజేఐ జస్టిస్ చంద్ర‌చూడ్‌కి ఘన వీడ్కోలు

Supreme Court Bid Farewell To CJI Dy Chandrachud: 50వ సీజేఐగా జస్టిస్ చంద్ర‌చూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. అయితే శుక్రవారం ఆయనకు లాస్ట్ వర్కింగ్ డే కావడంతో సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ రెండేళ్ల ప‌ద‌వీకాలంలో ఆయన ఎన్నో కీల‌క‌ తీర్పులిచ్చారు. అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తుల్లో ఒక‌రిగా ఉన్నారు. అలాగే జమ్మూ కశ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు సమర్థన, వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథ‌మిక హ‌క్కు, శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో మ‌హిళ‌ల‌కు ఎంట్రీ, ఏకాభిప్రాయ స్వ‌లింగ సంప‌ర్కానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త, వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త‌న ప‌ద‌వీకాలంలో అనుకోకుండా ఎవ‌రినైనా బాధ‌పెట్టుంటే క్ష‌మించాల‌ని కోరారు.

Related News

Latest News