ఎన్యూమరేషన్ ఫామ్‌లో తప్పులు జరిగితే కొత్తది ఇస్తారు.. ఓటర్లకు అధికారుల సూచనలు

ప్రతిపక్షం, జూలై 03: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ ఫామ్‌ల పంపిణీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఫామ్ నింపేటప్పుడు వివరాలు పొరపాటున తప్పుగా రాస్తే ఏం చేయాలనే సందేహాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి.

ఈ అంశంపై అధికారులు స్పందిస్తూ, ఫామ్ పూర్తిగా తప్పుగా నింపినా లేదా పేజీ చిరిగిపోయినా అవసరాన్ని బట్టి బూత్ లెవల్ అధికారులు (BLOలు) కొత్త ఫామ్ అందజేస్తారని తెలిపారు. చిన్నచిన్న పొరపాట్లు లేదా కొట్టివేతలు ఉంటే వాటిని సరిచేసి ఉపయోగించవచ్చని పేర్కొన్నారు.

అయితే పేరు, చిరునామా, జనన తేదీ, గుర్తింపు వివరాలు వంటి కీలక సమాచారం తప్పుగా నమోదు చేసినట్లయితే, కొత్త ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకుని తిరిగి సరిగ్గా నింపడం ఉత్తమమని అధికారులు సూచించారు. దీంతో భవిష్యత్తులో ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు.

Spread the love

Related News

Latest News