ప్రతిపక్షం, జూలై 04: వివాహేతర సంబంధాలకు సంబంధించిన వివాదాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భాగస్వామి తన చర్యలను దాచుకునేందుకు వ్యక్తిగత గోప్యత హక్కును కవచంగా ఉపయోగించుకోలేరని ధర్మాసనం స్పష్టం చేసింది.
భర్త లేదా భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించేందుకు మొబైల్ కాల్ డేటా, హోటల్ రికార్డులు వంటి ఆధారాలను చట్టబద్ధంగా సేకరించవచ్చని పేర్కొంది. అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు సంపూర్ణమైనది కాదని, అది ప్రజా ప్రయోజనాలు మరియు న్యాయపరమైన అవసరాలకు లోబడి ఉంటుందని వెల్లడించింది.
తమ తప్పులను దాచిపెట్టేందుకు వ్యక్తిగత గోప్యత హక్కును ఆశ్రయించలేరని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
















