సింగపూర్‌లో లైంగిక వేధింపుల ఆరోపణ.. హైదరాబాద్‌లో కేసు నమోదు

ప్రతిపక్షం, జూలై 10: పెళ్లి చేసుకుంటానని నమ్మించి సింగపూర్‌లో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు వివాహం పేరుతో మోసం చేసి లైంగికంగా వేధించాడని, అనంతరం ముఖం చాటేశాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విదేశంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నారు.

Spread the love

Related News

Latest News