ప్రతిపక్షం, జూలై 13: ‘లెనిన్’ సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ తనకు కొడుకు లాంటివాడని పేర్కొంటూ సినిమా విజయంపై అభినందనలు తెలియజేశారు. ఈ ట్వీట్‌కు అఖిల్ హృదయపూర్వకంగా స్పందించారు.
“పెదనాన్న.. మీరు ఎప్పుడూ చూపించే ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రోత్సాహం, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి ‘లెనిన్’ సినిమా చూడండి. త్వరలోనే మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడతాను” అంటూ అఖిల్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, చిరంజీవి చేసిన ట్వీట్‌కు నటుడు నాగార్జున కూడా స్పందించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిరంజీవి–అఖిల్ మధ్య జరిగిన ఈ ఆప్యాయ ట్వీట్‌ల మార్పిడి అభిమానులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

















