ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు ‘జన నాయగన్’

ప్రతిపక్షం, జూలై 15: తమిళ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జన నాయగన్’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలుత ఈ సినిమా 24న విడుదలయ్యే అవకాశముందని ప్రచారం జరిగినప్పటికీ, ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

సినిమా విడుదల సందర్భంగా మేకర్స్ ప్రత్యేక సందేశం విడుదల చేశారు. “పోరాటం ఎంత కఠినంగా ఉంటే.. విజయం అంత గొప్పగా ఉంటుంది” అంటూ విడుదలకు ముందు ఎదురైన సవాళ్లను ప్రస్తావించారు.

సెన్సార్‌కు సంబంధించిన వివాదాల కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు కావడంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spread the love

Related News

Latest News