ప్రతిపక్షం, జూలై 16: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రభాస్ గన్ పట్టుకుని కూర్చున్న ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘‘అజ్ఞాతపర్వం ముగిసింది.. తిరుగుబాటు ప్రారంభమైంది’’ అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

















