[t4b-ticker]

చౌటుప్పల్ లో భారీ వర్ష బీభత్సం.. కూలిన చెట్టు కారు ధ్వంసం.

*ముంపు ప్రాంతాలను పరిశీలించిన చైర్ పర్సన్ పావని.

*ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు.

ప్రతిపక్షం, చౌటుప్పల్ సెప్టెంబర్ 19: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కురిసిన భారీ వర్షానికి 14వ వార్డులో రోడ్డు పక్కన నిలిపిన కారుపై ఒక పెద్ద వృక్షం కూలిపడింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్, కో-ఆప్షన్ మెంబర్‌తో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర ఆందోళనలో ఉన్న బాధితులకు చైర్‌పర్సన్ మనోధైర్యం చెప్పారు. ప్రభుత్వం, మున్సిపల్ యంత్రాంగం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం మల్లికార్జున స్కూల్ మరియు గంగ వాటర్ ఫిల్టర్ సమీపంలో డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలువలకు సంబంధించిన పనులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

ఏ సమయంలో సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్న చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News