[t4b-ticker]

శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం

ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొన్న ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

ప్రతిపక్షం, సెప్టెంబర్ 21, శామీర్ పేట: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫౌజీ హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో షాపూర్‌కు చెందిన రాజు (42) తీవ్రంగా గాయపడి, ఘటనాస్థలంలోనే మృతి

స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న శామీర్‌పేట పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News