టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ప్రత్యేక పూజలు.
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మొక్కులు .
ప్రతిపక్షం, బాలాపూర్ సెప్టెంబర్ 22: బాలాపూర్ లడ్డూ ప్రసాదం, గణపతి విశిష్టతకు ప్రసిద్ధిగాంచిన చారిత్రక బాలాపూర్ గణనాథుడిని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, తెలంగాణ రాష్ట్రం పాడిపంటలు, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ పూజా కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉత్సవ సమితి నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.































