[t4b-ticker]

శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు

జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని బీజేపీ నిరసన

ప్రతిపక్షo ప్రతినిధి, మెదక్, సెప్టెంబర్ 22: పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థినిలు రాందాస్ చౌరస్తా వద్దకు చేరుకొని ధర్నా నిర్వహించారుఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. జీవో నంబర్‌ 97తో పాలిటెక్నిక్ విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీవో నంబర్‌ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.“శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు.పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు మెదక్ బీజేపీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Spread the love

Related News

Latest News