Trending Now

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..?

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హీరోయిన్ తాప్సీ, తన ప్రియుడు మథియాస్ బోను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఉదయ్‌పూర్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వారి వివాహం జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లి వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. మథియాస్‌తో గత పదేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు తాప్సీ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.

తెలుగులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు తాప్సీ నటనకు అందానికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆతర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. ప్రభాస్ తో కలిసి మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కూడా అందుకుంది.

Spread the love

Related News

Latest News