మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 16 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వోడి తల సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిందని ఎన్నికల మేనిఫెస్టో బాండ్ రాసి ఇచ్చిందని ఐదు నెలల తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో కూడా 500 రూపాయల బోనస్ ఇస్తామని రైతులతో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మాట మార్చి కేవలం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని అంటున్నారని కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ప్రభుత్వమని మండిపడ్డారు.
ఇక్కడి స్థానిక మంత్రి కూడా రైతులకు అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మాట్లాడాడని ఇప్పుడు రైతులకు మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ఇచ్చిందంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అది కూడా మహిళలకు బస్సులు పెంచకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇక్కడి మంత్రి నెలకొకసారి అయినా బస్టాండ్ కు వెళ్లి మహిళలతో మాట్లాడి డిపోకు వెళ్లి సిబ్బందితో చర్చించి బస్సులు పెంచాలని మహిళలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, ఎంపీపీ లకావత్ మానస, కౌన్సిలర్లు పేరుక భాగ్యరెడ్డి, బొల్లి కల్పన, శ్రీనివాస్, భోజ రమా, రవీందర్, వాల సుప్రజా, నవీన్ రావు, కొంకటి నళినీ దేవి, గోవిందు, రవి, బొజ్జ హరీష్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు ఎండీ అన్వర్, గంగ మధుసూదన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అయిలేని శంకర్ రెడ్డి, ఎండీ అయుబ్, వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ ఎడబోయిన రజిని, తిరుపతిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.