Trending Now

ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందిని బీఆర్‌ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ కలిశారు. అనంతరం ఆర్‌ఎస్పీ మాట్లాడుతూ.. కవిత గారు చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. లాయర్ కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిరంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతుందన్నారు. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోడీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు. కవిత దగ్గర నుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, pmla ఎలా వర్తిస్తుంది..? లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. వాళ్ళ పేర్లు, వీళ్లా పేర్లు చెప్పండి అంటూ కవితపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లుగా కవిత చెప్పారు. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది. విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటుందన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఈరికించారని తెలిపారు. న్యాయస్థానలపై నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో కవిత ఉన్నారు.

బీజేపీ కి ఎవరు ఎదురు ఉండకూడదనే ప్రతిపక్ష పార్టీలను భయబ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ లిక్కర్ కేసు కేసే కాదు, అదొక పాలసీ.. దాన్ని బూచిగా చూపించి తెలంగాణలో బీఅర్‌ఎస్, ఢిల్లీలో ఆప్ పార్టీని దెబ్బతీసే కుట్ర. లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి లాభమే జరిగింది. బీజేపీ వంటకాన్నివండి.. సీబీఐ, ఈడీ ని ఆప్, బీఅర్‌ఎస్ మీదకి వదిలింది. ఇలాంటి కేసులతో మమ్మల్ని భయబ్రాంతులకు గురి అవుతామనే భ్రమలో బీజేపీ నేతలు ఉన్నారు, కానీ భయపడే ప్రసక్తే లేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. దేశంలో పాసిస్ట్ పాలన నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. బీజేపీ 220 సీట్లు దాటదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. ప్రతిపక్ష పార్టీల నేతలను జైల్లో పెట్టి ప్రజాతీర్పును వారికి అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలకు ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పనున్నారన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టిన తలవంచకుండా పోరాటం చేస్తాం. మొండిగానే పోరాడుతామని కవిత చెప్పారు అని బాల్క సుమన్ తెలిపారు.

Spread the love

Related News

Latest News