Trending Now

రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేతకి కాలు ఫ్రాక్చర్..

ప్రతిపక్షం, నకిరేకల్: చిట్యాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది శేపూరి మధుసూదన్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. నల్గొండ కోర్టుకు వెళ్లి విధులు నిర్వహించుకొని తిరిగి చిట్యాలకు వస్తుండగా శుక్రవారం సాయంత్రం నార్కట్‌‌పల్లి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శేపూరి మధు కాలు విరిగింది. చికిత్స నిమిత్తం కామినేని ఆసుపత్రిలో చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు రాత్రి అంబులెన్స్ లో ఇంటికి తీసుకువచ్చారు. నార్కట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రమాదానికి కారకుడైన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

Spread the love

Related News

Latest News