సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ లేఖ
ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసుని సీబీఐకి అప్పగించాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తంచేశారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిగితే కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదని.. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరగకుండా ఢిల్లీ స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయిని లేఖలో పేర్కొన్నారు. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ని విచారిస్తే రాష్ట్ర దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరిగేదని ఆయన తెలిపారు. ఆ పని చేయకపోవడంవల్లే సీబీఐ విచారణ కోరుతున్నామని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు.