ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 1 : తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మరో వారం రోజులు సెలవులు పొడిగించాలని నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంబడి చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. శనివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేస్తూ.. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత మరో వారం రోజులు ఉండనుందని తెలిసిన సందర్భంగా ఇంటర్ విద్యార్థులకు మరో వారం రోజులు సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని ఆయన అన్నారు.