ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 6 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక మొత్తంలో చేరేలా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాలని పలువురు కోరారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని పాక్ పట్ల గ్రామంలో గురువారం ప్రొఫెసర్ కీ.శే. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. 15 రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తల్లిదండ్రులు చేర్పించిన బడిబాట కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నదని ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థులు, పోషకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.