ప్రతిపక్షం, వెబ్డెస్క్: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల గృహ రుణాల వడ్డీ రాయితీపై యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఇంటి నిర్మాణం ప్రారంభించిన/ కొనుగోలు చేసిన ఏడాదిలో బ్యాంకు రుణం పొందితేనే రాయితీని ఇచ్చేది. ఇప్పుడా కాలపరిమితిని ఎత్తేసింది. అలాగే ప్రస్తుతం 8.33% కన్నా తక్కువ వడ్డీకి రుణం తీసుకున్నవారికి మాత్రమే 6-7% రాయితీ ఇస్తుండగా, ఇకపై 8.3% వరకు వర్తింపజేయనుంది. ఈ నిర్ణయంతో 4వేల మందికి ప్రయోజనం చేకూరనుంది.