ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, జూన్ 15: హనుమకొండ జిల్లా కలెక్టర్గా ప్రావీణ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2016 బ్యాచ్ కి చెందిన ప్రావీణ్య 2021 నుండి 2023 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023లో వరంగల్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్న ప్రావీణ్య శనివారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బదిలీ అయ్యారు. ఇక్కడ పని చేసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ నారాయణపేటకు బదిలీ కాగా.. వరంగల్ కలెక్టర్గా ఎం. సత్యశారదా దేవి నియమితులయ్యారు.