- షాడో నీడలో వనపర్తి మున్సిపాలిటీ..
- మున్సిపల్ కమిషనర్లు మారిన… ఆయన మాత్రం శానీటరీ హోదాలోనే.. •బిల్ కలెక్టర్ వ్యక్తి దశాబ్దకాలంగా శానీటరీ ఇన్స్పెక్టర్ గా అన్ని వ్యవహారాలు చక్క బెడుతూ… •అక్రమాలకు పాల్పడుతున్నారనే జోరుగా ప్రచారం
వనపర్తి, ప్రతిపక్షం, జూన్ 30: వనపర్తి హౌసింగ్ శాఖ నుండి వనపర్తి మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ గా ఓ అధికారి నియమితులయ్యారు. కానీ దశబ్దాకాలంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు.ఎంతమంది మున్సిపల్ కమిషనర్లు వచ్చి మారిన… తాను మాత్రం శానిటరీ ఇన్స్పెక్టర్ హోదాలో కొనసాగుతూ కుర్చీని వదడం లేదు.గత ప్రభుత్వ హయoలోనే గాక.. ఇప్పుడు కూడా ఆ అయ్య గారిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఏళ్లుగా షాడో కమిషనర్ గా అన్ని విభాగాల వ్యవహారాలను చక్కబెట్టుతుంటాడు.కానీ అసలైన కోసమెరుపు ఏమిటంటే బిల్లు కలెక్టర్ గా విధులు నిర్వహించాల్సిన సదరు వ్యక్తి శానిటరీ ఇన్స్పెక్టర్ గా దశబ్దకాలంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు.ఏళ్ల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన సదరు ఉద్యోగిని వేరే స్థానానికి మార్చాలని అటు ప్రజలు.. ఇటు కౌన్సిల్ సభ్యులు మొరపెట్టుకున్న..పైరవీలతో పేరుతో తిరిగి అదే స్థానంలో కొనసాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తను బిల్ కలెక్టర్ స్థానంలో విధులు నిర్వహించాల్సింది పోయి.. శాటీటరీ ఇన్స్పెక్టర్ గా కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ప్రచారం సాగుతోంది.
మున్సిపాలిటీలో ఆ అధికారి పై చర్చ..
వనపర్తి మున్సిపాలిటీలో ఓ అధికారి దీర్ఘకాలిక విధులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలో శానీటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి సుమారు దశాబ్ద కాలంగా కొనసాగుతుండటంపై సర్వర్త విమర్శలు వస్తున్నాయి.వనపర్తి హౌసింగ్ శాఖ నుండి వనపర్తి మున్సిపాలిటీ బిల్ కలెక్టర్ గా నియమితులైన సదరు అధికారి తన విధులు నిర్వహించకుండా..పైరవిలతో తనకు నచ్చిన శాఖలో కొనసాగుతూ…మున్సిపాలిటీ అంతా తన కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.ఏళ్లుగా తిష్ట వేసిన సదరు అధికారిని ఈసారైనా వేరే శాఖకు మార్చుతారా?అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఈ సారైనా అక్కడి నుంచి కదులుతారా ..?
వనపర్తి మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న సదరు ఉద్యోగి అక్కడే ఉండేందుకు ప్రతి సారి నానా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.ఏళ్లుగా అక్కడే తిష్ట వేసి షాడో అధికారిగా అన్ని శాఖలను తన కనుసన్నల్లో శాసిస్తున్నట్లు ప్రచారం. ఈయన వచ్చిన తర్వాత ఎంతమంది కమిషనర్లు వచ్చి బదిలీ అయిపోయినప్పటికీ తను మాత్రం తనకు నచ్చిన శాఖలో ఉండేందుకు ఫైరవి చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తను అదే స్థానంలో కొనసాగేందుకు పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే ఈసారైనా సదరు అధికారిని ఆ కుర్చీ నుంచి మారుస్తారా ? లేదా అనే దానిపై సంబంధిత అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
పైస్థాయి అధికారులు చర్యలు తీసుకోవటానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?
ఆరోపణలు, వస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకునేందుకు పై స్థాయి అధికారులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అంతర్యం ఏమిటో, జిల్లాలో ఏళ్ల తరబడి ఒకేచోట కొనసాగుతున్న సదరు ఉద్యోగి వ్యవహారంపై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
















