ఓఆర్‌ఆర్‌పై పోలీసుల కాల్పులు.. మోస్ట్ వాంటెడ్ నిందితుడు అదుపులో

ప్రతిపక్షం, జూలై 01: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) బొంగులూరు ఎగ్జిట్ నంబర్-12 సమీపంలో మంగళవారం రాత్రి పోలీసులు కాల్పులు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీ, దోపిడీ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న భూషణ్ శ్రీకాంత్‌ను నల్గొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ముందస్తు సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో అతడు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అతని కాళ్లపై కాల్పులు జరిపినట్లు సమాచారం. గాయపడిన నిందితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News