•ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల ప్రిన్సిపాల్ బి. జగన్
ప్రతిపక్షం, జూలై 02, వనపర్తి ప్రతినిధి: తెలంగాణ పాలిసెట్ -2026 ప్రవేశాల అనంతరం మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వనపర్తి కేడిఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ బి. జగన్ తెలిపారు.జూలై 1 నుండి జూలై 3 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు.అలాగే జులై 4న ఉదయం 9గంటలకు స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడుతాయని పాలిసెట్ రాసిన వారు, పాలిసెట్ రాయని వారు కూడా అర్హులు అని తెలిపారు.డిప్లమా బయోటెక్నాలజీ -33,డిప్లమా మెకానికల్ ఇంజనీరింగ్ -19,డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ -18,డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ -8,డిప్లమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజని్రింగ్ -1, ఖాళీలు ఉన్నాయని తెలిపారు.పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు కళాశాలను సందర్శించగలరని మనవి చేశారు.
















