అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా: మంత్రి జూపల్లి

ప్రతిపక్షం, జూలై 03: గత బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పులపై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. రాష్ట్ర అప్పులపై తన వద్ద ఉన్న వివరాలను కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు వాట్సాప్ ద్వారా పంపిస్తానని తెలిపారు.

ఆ లెక్కలు తప్పని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నిరూపింపజేస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయడానికి సిద్ధమని జూపల్లి సవాల్ విసిరారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, వాస్తవాలతోనే మాట్లాడుతున్నానని అన్నారు.

రాష్ట్ర అప్పుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర ఆరోపణలు, సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో జూపల్లి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Spread the love

Related News

Latest News