[t4b-ticker]

రైతులకు కరెంట్ ఇవ్వకుండా వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

*చౌటుప్పల్ DE కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా..

*లాగ్ బుక్ చూపించాలని డిమాండ్ – రైతులకు కరెంట్ కోతలపై బీఆర్ఎస్ ఫైర్ .

*అదనంగా 2 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు –

*కేసీఆర్ కట్టిన వ్యవస్థను కూడా నడపలేరా? అని ఫైర్

*మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .

ప్రతిపక్షం, చౌటుప్పల్ సెప్టెంబర్ 22: వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ ను సక్రమంగా సరఫరా చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్ విద్యుత్ శాఖ DE కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన మేరకు విద్యుత్ సరఫరా జరగడం లేదని, విద్యుత్ కోతల కారణంగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బోర్లు, మోటార్లపై ఆధారపడే రైతులకు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

*లాగ్ బుక్ చూపించాలని డిమాండ్..

వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారో లాగ్ బుక్ లో ఉన్న వివరాలను చూపించాలని DEని కోరారు. అయితే అధికారులు స్పష్టమైన వివరాలు వెల్లడించకుండా, ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తామని చెప్పారని తెలిపారు. అనంతరం ఇకపై అదనంగా రెండు గంటల విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని తెలిపారు.

*కేసీఆర్ కట్టిన వ్యవస్థను నడపలేరా?

కేసీఆర్ కట్టిన ఇల్లు, పెట్టిన వ్యవస్థను పదేళ్లు సక్కగా నడిపి రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చామని, అదే వ్యవస్థను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నడపలేకపోతుందని ప్రశ్నించారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు గంటల కరెంట్ అని ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని, ఇప్పుడు ఆ నాయకులు ఎక్కడున్నారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేకు నియోజకవర్గ రైతుల సమస్యలు పట్టడం లేదని, మంత్రి చుట్టూ తిరగడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్, మున్సిపాలిటీ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మల్లేష్ గౌడ్, నారాయణపురం మండల అధ్యక్షులు నర్రి నరసింహ,కౌన్సిలర్లు, సర్పంచులు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News