జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి

మెదక్, నవంబర్ 07 (ప్రతిపక్షం ప్రతినిధి): జిల్లా ప్రజలందరికీ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని అధిక శబ్దం, వాయు కాలుష్యానికి కారణమయ్యే టపాసులకు దూరంగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, తగిన జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలిపారు.దీపావళి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరి ఇళ్లలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.

Related News

Latest News