భద్రాద్రి కొత్తగూడె జిల్లా భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ గర్భిణి ఆసుపత్రి ఎదుటే ఆటోలో ప్రసవించింది. ఈ ఘటన నిన్న రాత్రి జరగగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి కలిగిందని గర్భిణి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది.