ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సమీక్ష నిర్వహించారు. రాచరిక ఆనవాళ్లు లేకుండా.. ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా చిహ్నం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి, కోదండరాం, పలువురు ఎమ్మెల్యేలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చిహ్నాన్ని విడుదల చేయనున్నారు.