మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్‌: ప్రధాని మోదీ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో బదులిచ్చారు. విపక్షాల నిరసనల మధ్య ప్రధాని తన ప్రసంగం కొనసాగించారు. రాబోయే ఐదేండ్లలో పేదరికంపై పోరాటంలో విజయం సాధిస్తామని చెప్పారు. భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించే నాటికి ఆ ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్‌ తీరు మారలేదని ఎద్దేవా చేశారు.

Related News

Latest News