Delhi: అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా.. త్వరలో ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణం!

Arvind Kejriwal resigns.. Atishi will be sworn in as Delhi CM soon: ఢిల్లీలో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. నిర్దోషిగా నిరూపించుకునే వరకు తాను సీఎం పదవిలో ఉండనని ప్రకటించిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాను కలిసిన ఆయన.. తన రాజీనామా లేఖను అందజేశారు. ఆయనతో పాటు ఆప్‌ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతిశీ, ఇతర మంత్రులు సైతం ఉన్నారు. కేజ్రీవాల్‌ రాజీనామాను ఎల్జీ ఆమోదించాక.. త్వరలోనే అతిశీ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Related News

Latest News