ప్రతిపక్షం, జూన్ 16: హైదరాబాద్లో కో-లివింగ్, సహజీవనం సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఓ సర్వే ప్రకారం నగరంలోని సుమారు 400 హాస్టళ్లలో 70 వేల మందికి పైగా యువత ఈ విధానంలో నివసిస్తున్నారు. ప్రారంభంలో సౌకర్యవంతంగా కనిపించే ఈ జీవనశైలి, కాలక్రమేణా వ్యక్తిగత విభేదాలు, అపార్థాలు, సంబంధాల్లో సమస్యలకు దారితీస్తోందని తెలుస్తోంది. దీంతో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న ఫిర్యాదుల సంఖ్య కూడా పెరుగుతోంది. స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటడం, పరస్పర అవగాహన లోపించడం వంటి కారణాలు వివాదాలకు దారితీస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.















