కేతన్ హత్య కేసులో కొత్త కోణం.. విచారణలో సియా చెప్పినట్లు ప్రచారం

ప్రతిపక్షం, జూన్ 26: కేతన్ హత్య కేసు దర్యాప్తులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. పోలీసుల విచారణలో నిందితురాలు సియా పలు కీలక విషయాలు వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది.

విచారణలో కేతన్‌ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని, అతని రూపురేఖలు, ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి వారిని బాధపెట్టడం కంటే మరో మార్గాన్ని ఎంచుకున్నానని ఆమె చెప్పినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

అయితే ఈ వివరాలపై పోలీసులు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News