[t4b-ticker]

బోలక్‌పూర్‌లో ఘనంగా బీరప్ప, అక్క మహంకాళి బోనాలు

ఘనంగా కురుమ సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు.

డప్పు చప్పుళ్లు, బోనాలు తో వైభవంగా ఊరేగింపు.

ప్రతిపక్షం, ఆగస్టు 06, కూకట్‌పల్లి: బోలక్‌పూర్ డివిజన్ పరిధిలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప, అక్క మహంకాళి బోనాల పండుగను అత్యంత వైభవంగా, నిర్వహించారు. కుల పెద్దలందరి ఆధ్వర్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి.ఈ సందర్భంగా భక్తులు తొలుత బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్క మహంకాళి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించారు. బీరప్ప ఆలయం నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు ప్రధాన వీధుల గుండా అక్క మహంకాళి గుడి వరకు కోలాహలంగా కొనసాగింది.సంప్రదాయ డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్సాలతో ఊరేగింపు మార్గమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి, బీరప్ప స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు, కుల పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉత్సవాల అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ చేపట్టారు.

Spread the love

Related News

Latest News