మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్
ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఈ నెల 27న పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కోరారు. గాంధీ భవన్లో గరువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వంద రోజుల పాలనలోనే ముప్పై వేల ఉద్యోగాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారికే సాధ్యం అయ్యిందన్నారు. ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి.. వాటి భర్తీ కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. స్కూల్ విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాల సరఫరా ఇప్పటికే పూర్తి అయ్యింది.
పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుంది అని ఆలోచించాలి. తీన్మార్ మల్లన్న నిరుద్యోగులకు, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా ఉంటారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు పదోన్నతులు రావాల్సి ఉంది.. త్వరలోనే ప్రభుత్వం ఆ కార్యాచరణ చేపడుతుంది. పదేళ్లలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు.