Trending Now

విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాలి : కలెక్టర్ మను చౌదరి

ప్రతిపక్షం, సిద్దిపేట మే 29: గత 33 సంత్సరాలుగా విద్యా సేవలో విద్యార్థుల భవిష్యత్ కు బాటలు వేయడం గొప్ప విషయం అని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. డీఎస్ఎం హైస్కూల్ పాంప్లెంట్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని విధాలుగా ఆఫర్లు ఇచ్చుకుంటూ విద్యార్థుల, తల్లిదండ్రులకు ఎంతో సహయ సహకారాల నందిస్తున్నారని, అదే పంథాలో ఈ సంత్సరం కూడా 2024-2025 అకాడమిక్ ను తల్లిదండ్రులు లేని నిరుపేద విద్యార్దులకు ఉచిత విద్యను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ మను చౌదరి డీఎస్ఎం హైస్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. నర్సరి నుండి 5 వ క్లాస్ వరకు ఉచితంగా టెక్స్ట్ బుక్స్ ను కూడా ఇస్తున్నారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ బుక్స్ కొనాలంటే కన్నవారికి తల్లిదండ్రు లకు ఒక పెద్ద భారంగా ఉందని, ఈ విధంగా కొంత ఊరటను ఇస్తూ.. కొంత బారాన్ని తగ్గిస్తున్నారని ఇది ఒక గొప్ప మంచి పని అని కొనియడారు. ఇలాంటి మంచి అవకాశాన్ని పుర జనులందరు సద్వినియోగ పరుచుకోవాలని కోరారు. ఆహర్నిశలు విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకోసం తపించే ఈ విద్యా సంస్థ మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్యమంలో డీఎస్‌ఎం హైస్కూల్ ప్రిన్సిపాల్ మిద్దెల యాదగిరి, వైఫ్, పిన్సిపాల్ అక్షయ, ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News