Trending Now

‘బెస్ట్ అవైలబుల్ పాఠశాలల దరఖాస్తు గడవు పొడిగించండి’.. కలెక్టర్‌కు వినతి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 5 : నిర్మల్ జిల్లాలో ఈనెల 7 న ముగిస్తున్నటువంటి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల దరఖాస్తు గడువును పొడిగించాలని నిర్మల్ జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కలెక్టర్, డీఎస్డబ్ల్యూఓ రాజేశ్వర్ గౌడ్ లకు బుధవారం వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో ఈనెల 7 న ముగిస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ దరఖాస్తుల గడువును 15 రోజుల వరకు పొడిగించాలని జిల్లాలో ఇప్పటివరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువలన చాలావరకు నిరుపేద తల్లిదండ్రులు వారి పిల్లల ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు పొందలేకపోయారని పేర్కొన్నారు. దీనిని గమనించి ఇంకో 15 రోజులపాటు గడువు పొడిగించాలని విద్యార్థులు నష్టపోకుండా చూడవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులదేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు.

గడువును పెంచకుంటే అర్హులైన ఎంతోమంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ చూపి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటస్వామి , జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్, ఉపాధ్యక్షులు దామ భూమేష్, కోశాధికారి కోలగని రాజు, పట్టణ అధ్యక్షులు కత్తి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News