వనపర్తి ఎస్పీ కార్యాలయంలో భారీ నాగుపాము కలకలం

  • సురక్షితంగా పట్టుకున్న స్నేక్ సొసైటీ

ప్రతిపక్షం, జూన్ 05: వనపర్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం (SP Office) ఆవరణలో శుక్రవారం ఒక భారీ నాగుపాము కలకలం సృష్టించింది. ప్రపంచ ప్రకృతి దినోత్సవం రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం, పాముకు ఎలాంటి హాని తలపెట్టకుండా స్నేక్ సొసైటీ అధ్యక్షులు. కృష్ణ సాగర్ సురక్షితంగా పట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే..?

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రధాన ముఖద్వారం (మొదటి గేటు) వద్ద ఏఆర్ పిసి (AR PC) కిరణ్ కుమార్ విధుల్లో ఉండగా, వారికి అక్కడ ఒక భారీ నాగుపాము సంచరిస్తూ కనిపించింది. కార్యాలయ సిబ్బంది, వచ్చే పోయే వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎం.శ్రీనివాసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వనపర్తి జిల్లా స్నేక్స్ సొసైటీ అధ్యక్షులు కృష్ణసాగర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

సురక్షితంగా పట్టుకున్న స్నేక్ సొసైటీ

సమాచారం అందుకున్న వెంటనే స్నేక్స్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కృష్ణసాగర్ ఎస్పీ కార్యాలయ మొదటి గేటు వద్దకు చేరుకున్నారు. తన నైపుణ్యంతో ఆ భారీ నాగుపామును ఎవరికీ ఎలాంటి హాని జరగకుండా, సురక్షితంగా పట్టుకున్నారు.అనంతరం ఆ పామును జనావాసాలు లేని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు తెలిపారు.సమయస్ఫూర్తితో వ్యవహరించి, పామును సురక్షితంగా పట్టుకున్న కృష్ణసాగర్‌ను ఎస్పీ కార్యాలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.

Spread the love

Related News

Latest News