డేంజర్ హీట్ సిటీల జాబితాలో హైదరాబాద్.. ఆందోళన కలిగిస్తున్న అధ్యయనం

ప్రతిపక్షం, జూన్ 12: ప్రపంచంలో వేడి సంబంధిత అనారోగ్యాల ముప్పు ఎక్కువగా ఉన్న 30 నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్ 0.68 స్కోరు సాధించింది. వేగవంతమైన పట్టణీకరణ, పచ్చదనం తగ్గిపోవడం, ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరగడం వంటి కారణాలు వేడి తీవ్రతను పెంచుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 వరకు నగరంలో 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవగా, ఇది గత దశాబ్దంలో అత్యధికంగా నమోదైన రికార్డుగా గుర్తించారు.

Spread the love

Related News

Latest News