బండి భగీరథ్‌కు బెయిల్.. జైలు నుంచి విడుదల

జూన్ 20, సందర్బం: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితుడి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. భగీరథ్ బెయిల్ పిటిషన్‌ను పోలీసులు లేదా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు వ్యతిరేకించలేదని ఆయన పేర్కొన్నారు.

బెయిల్ మంజూరు కావడంతో శనివారం ఉదయం భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లినట్లు సమాచారం.

అయితే కేసుకు సంబంధించిన విచారణ ప్రక్రియ కొనసాగుతుండగా, తదుపరి న్యాయపరమైన చర్యలు కోర్టు ఆదేశాల మేరకు కొనసాగనున్నాయి.

Spread the love

Related News