గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

ప్రతిపక్షం, జూన్ 26: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలోని ఏఎంబీ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. హఫీజ్‌పేట్–గచ్చిబౌలి మార్గంలో తప్పు దారిలో వస్తున్న స్కూటీని ఎదురుగా వస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న శ్రీకాంత్, విఠల్ తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడుపుతున్న వినోద్‌కు గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News