[t4b-ticker]

చండూరు మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ముత్యాలు గౌడ్

ప్రతిపక్షం చండూరు, ఆగస్టు 05: చండూరు మండలం ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సరికొండ ముత్యాలు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోడంగిపర్తి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ ముత్యాలు గౌడ్‌ను చండూరు మండల పరిధిలోని 19 గ్రామ పంచాయతీలకు చెందిన ఉప సర్పంచులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా ఎండీ మహమ్మద్ (బంగారుగడ్డ), ఉపాధ్యక్షుడిగా కామిశెట్టి రమణ (సిరిదేపల్లి), ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి రాములు (ధోనిపాముల), సహాయ కార్యదర్శిగా సిహెచ్ ఉషయ్య (పుల్లెంల), కోశాధికారిగా టేకుల ఉపేందర్ రెడ్డి (గుండ్లపల్లి) మండల కమిటీగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కార్యక్రమంలో పెండ్యం ఉపేందర్, మరల వెంకన్న, పల్లపు స్వామి, కడారి నరసింహ, పగిళ్ల రమణమ్మ, కట్ట స్వర్ణ, కూరపాటి నిర్మల, గుండెబోయిన సైదులు, చొప్పరి మాలతి, మారగోని రజిత పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News