Trending Now

అబద్ధాల కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి

రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రతిపక్షం, దుబ్బాక, మే 16: అబద్ధాల కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని రైతు ధర్నాలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు గురువారం దుబ్బాక బస్ స్టాండ్ చౌరస్తాలో నిర్వహించిన రైతు నిరసన ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని ఆందోళన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గద్దె నెక్కిందన్నారు. కానీ బోనస్‌ను వానాకాలం లో, యాసంగి లో కూడా ఇవ్వలేదని మండి పడ్డారు. కానీ నేడు సన్న ధాన్యానికి మాత్రమే ఇస్తామని తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు. ఈ సంవత్సరం యాసంగిలో 30 శాతానికి పైగా పంట పొలాలు ఎండిపోయాయని, దిగుబడులు కూడా తగ్గాయని, రైతులు పండించిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో రైతుల కోసం ప్రాజెక్టులు నిర్మించి, సాగునీళ్లు ఇచ్చారని మిషన్ కాకతీయ ద్వారా చెరువు, కుంటలు బాగు చేసుకున్నామని, 24 గంటల కరెంటు ఇచ్చామని, రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ను రూ. 500 బోనస్ ఇచ్చే వరకు అడుగడుగునా నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండవెల్లి ఎల్లారెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బాణాల శ్రీనివాస్, మున్సిపాలిటీ అధ్యక్షుడు పల్లె వంశీ కృష్ణ గౌడ్, నాయకులు కొత్త కిషన్ రెడ్డి, పలు మండలాల పార్టీ అధ్యక్షు లు, పలువురు కౌన్సిలర్ లు ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News