Trending Now

అంగరంగా వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 23 : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలం కాల్వ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవల్లో భాగంగా గురువారం కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, పురపాలక సంఘం చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పాల్గొని గర్భాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి వేదపండితులు ఆశీర్వచనాలు అందించి,తీర్థప్రసాదాలు అందచేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వూజారం మహేష్, ఆలయ ధర్మకర్తలు డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, నిర్మల్ మున్సిపల్ చైర్మన్, గండ్రత్ ఈశ్వర్, దిలావర్ పూర్ ఎంపీపీ పాల్దే అనిల్ లను పూలమాలలు శాలువాలతో సన్మానించి శ్రీ కాల్వ లక్ష్మి నరసింహ స్వామి చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంగరంగా వైభవంగా స్వామి వారి కళ్యాణం జరుగుతుందని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన పురాతన ప్రసిద్ధి గాంచిన, దేవాలయం కాల్వ నరసింహ స్వామి దేవాలయమని అన్నారు. భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Spread the love

Related News

Latest News