కిషన్‌రెడ్డి ‘లడాయి కోతి’.. రేవంత్ విమర్శలు

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డిపై సీఎం ఎ. రేవంత్ రెడ్డి మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మియాపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహకారం అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తర్వాతే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని గుర్తుచేసిన రేవంత్, కిషన్‌రెడ్డి వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, తుమ్మిడిహెట్టి, గోదావరి జలాలు, సింగూరు నీటిని హైదరాబాద్‌కు తీసుకువచ్చే ప్రాజెక్టులకు కేంద్ర నిధులు రాకుండా అడ్డుకుంటున్నది మీరే కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీజేపీ ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

తెలంగాణ అభివృద్ధి, సాగునీరు, తాగునీటి అవసరాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో కాంగ్రెస్–బీజేపీ మధ్య రాజకీయ విమర్శల పర్వం మరింత ముదిరింది.

Spread the love

Related News

Latest News