కెరీర్ ఆశ చూపి మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు లైంగిక దాడి.. ఫుట్‌బాల్ కోచ్ అరెస్ట్

ప్రతిపక్షం, జూన్ 13: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఫుట్‌బాల్ కోచ్ మైనర్ క్రీడాకారిణిని కెరీర్ అవకాశాల పేరుతో మోసం చేసి, మూడేళ్లపాటు లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు 36 ఏళ్ల కోచ్ అభిజిత్ మెండల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

2023లో తన అకాడమీలో చేరిన 17 ఏళ్ల బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్న నిందితుడు, ఫుట్‌బాల్‌లో ఉన్నత అవకాశాలు కల్పిస్తానంటూ నమ్మించి లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమెకు సంబంధించిన అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు తీసి వాటితో బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నిరంతర వేధింపులతో మానసికంగా కుంగిపోయిన బాధితురాలు చివరకు కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, బెదిరింపుల కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News